తీహార్ జైలునుంచి విడుదలైన కేంద్ర మాజీ మంత్రి చిదంబరం
- బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- 106 రోజుల పాటు జైలు జీవితం
- స్వాగతం పలికిన కాంగ్రెస్ శ్రేణులు
ఐఎన్ఎక్స్ మీడియా సంస్థలో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. చిదంబరంపై ఎన్ ఫోర్సమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసులో ఆయన రిమాండులో వున్న విషయం తెలిసిందే. ఈ రోజు సుప్రీంకోర్టు ఆయనకు రూ.2 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అంతేకాక ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును కూడా కోరింది. విడుదల అనంతరం చిదంబరం మాట్లాడుతూ..కోర్టు తీర్పును గౌరవిస్తానని, కేసు గురించి వ్యాఖ్యానించనని పేర్కొన్నారు. తనపై ఒక్కఅభియోగం కూడా నిరూపితం కాలేదన్నారు.