తిరుమలలో తగ్గిన రద్దీ... 2 కంపార్టుమెంట్లలో మాత్రమే భక్తులు!
- తిరుమలపై భారీ వర్షాల ప్రభావం
- దర్శనానికి 4 గంటల సమయం
- మరికొన్ని రోజులు ఇంతేనంటున్న అధికారులు
నిన్న స్వామివారిని దాదాపు 70 వేల మందికి పైగా భక్తులు దర్శించుకోగా, రూ. 3 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభించింది. ఇంకొన్ని రోజులు రద్దీ సాధారణంగానే ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, తిరుమలలో గత రాత్రి కూడా వర్షం పడింది. భక్తులు వర్షంలో తడుస్తూనే స్వామి దర్శనానికి వెళుతున్నారు.