Chandrababu: మా కార్యకర్తలకు బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారు: చంద్రబాబు

  • టీడీపీ కార్యకర్తలపై 640 దాడులు జరిగాయి
  • వైసీపీ మంత్రులు బూతుల మంత్రులుగా మారారు
  • వివేకా హత్య కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు
వైసీపీ శ్రేణులు అనాగరికంగా ప్రవర్తిస్తున్నారని... వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై 640 దాడులు జరిగాయని చంద్రబాబు మండిపడ్డారు. అక్రమ కేసులను బనాయిస్తూ, బెయిల్ కూడా రాకుండా చేస్తున్నారని అన్నారు. దాడులపై ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని చెప్పారు. వైసీపీ మంత్రులు బూతుల మంత్రులుగా తయారయ్యారని దుయ్యబట్టారు. వైయస్ వివేకాను ఇంట్లోనే హత్య చేసి, కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలతో ఆడుకుంటే వైసీపీ పతనం తప్పదని చెప్పారు. కర్నూలు జిల్లాలో దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివ్యాంగులకు మొదటి నుంచి అండగా ఉన్నది టీడీపీనే అని చెప్పారు.
Chandrababu
Telugudesam
YSRCP

More Telugu News