Insurance Coverage on Banks Deposits: బ్యాంకు ఖాతాదారుల డిపాజిట్లపై బీమా లక్ష రూపాయలు మాత్రమే: డీఐసీజీసీ

  • సమాచార హక్కు ద్వారా దాఖలు చేసిన పిటిషన్ కు డీఐసీజీసీ సమాధానం
  • బ్యాంకులు విఫలమైనప్పుడు డిపాజిట్లపై రూ.లక్ష బీమా కవరేజీ  
  • పొదుపు, పిక్స్ డ్, కరెంట్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లకు వర్తింపు
బ్యాంకుల్లో ఖాతాదారులు జమచేసుకున్న తమ డిపాజిట్లపై బీమా వర్తింపు రూ.లక్షవరకే ఉంటుందని ఆర్బీఐ అనుబంధ సంస్థ డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్(డీఐసీజీసీ) పేర్కొంది. ఇటీవల బ్యాంకు ఖాతాదారులకు వర్తించే బీమాకు సంబంధించి జాతీయ మీడియా సంస్థ పీటీఐ, సమాచార హక్కు ద్వారా దాఖలు చేసిన పిటిషన్ కు డీఐసీజీసీ సమాధానమిచ్చింది.

‘డీఐసీజీసీ చట్టం 1961లోని సెక్షన్ 16(1) నిబంధనల ప్రకారం.. బ్యాంకులు విఫలమైనప్పుడు, నష్టాల్లో కూరుకున్నప్పుడు ఖాతాదారుల డిపాజిట్లపై డీఐసీజీసీ లక్ష రూపాయలవరకు బీమా కవరేజీ అందిస్తోంది. పొదుపు, పిక్స్ డ్, కరెంట్ ఖాతాలు, రికరింగ్ డిపాజిట్లకు ఈ బీమా వర్తిస్తుంది’ అని తెలిపింది. ఇది ఇలావుండగా బీమా పెంపు విషయమై ప్రతిపాదనేమైనా ఉందా అన్న పిటిషనర్ ప్రశ్నకు.. దానికి సంబంధించి తమ వద్ద ఎలాంటి సమాచారం లేదని వెల్లడించింది.
Insurance Coverage on Banks Deposits
DICGC

More Telugu News