గర్భవతిగా ఉన్నప్పుడు అనేక అవమానాలు ఎదురయ్యాయి: సానియా ఆవేదన
- శరీరాకృతిపై అవమానకరంగా కామెంట్లు చేస్తారు
- ఒక మహిళ కాస్త బరువు పెరిగినా.. గర్భవతా? అంటారు
- ఇకపై వారి నోర్లు మూయించాలని నిర్ణయించుకున్నా
సెలబ్రిటీలుగా తాము సౌకర్యవంతంగా ఉండాల్సి ఉంటుందని, తాను గతంలో గర్భవతిగా ఉన్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశానని, దాని వల్ల కూడా తనకు అవమానాలు ఎదురయ్యాయని సానియా తెలిపారు. ఇకపై తాను వారి నోర్లు మూయించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. కాగా, ఆమె కొన్ని నెలల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆమెపై సోషల్ మీడియాలో నెటిజన్లు పదే పదే కామెంట్లు చేస్తుంటారు.