కేసు నమోదుకు దిశ కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వచ్చింది: లోక్ సభలో ఉత్తమ్ కుమార్

  • జాతీయ రహదారుల వద్ద మద్యం అమ్మకూడదు
  • భద్రత అధికంగా ఉండే ప్రాంతంలోనే ఈ ఘటన జరిగింది
  • తెలంగాణ మద్యం పాలసీ బాగోలేదు
దిశను అత్యంత కిరాతకంగా హత్య చేశారని లోక్ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దిశ ఘటనపై లోక్ సభలో చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... హైదరాబాద్ కు కూతవేటు దూరంలో దిశ హత్య జరిగిందని అన్నారు. కేసు నమోదుకు బాధితురాలి కుటుంబ సభ్యులు పలు పోలీస్ స్టేషన్లు తిరగాల్సి వచ్చిందని చెప్పారు. మొదట వారు ఓ పోలీస్ స్టేషన్ కు వెళితే మరో స్టేషన్ కు వెళ్లాలని చెప్పారని తెలిపారు.

మొదటి స్టేషన్ లోనే వారు కేసు నమోదు చేసుకొని ఉంటే, ఆ అమ్మాయి ప్రాణాలు దక్కేవని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. జాతీయ రహదారుల వద్ద మద్యం అమ్మకూడదని నిబంధనలు ఉన్నాయని చెప్పారు. భద్రత అధికంగా ఉండే ప్రాంతంలోనే ఈ ఘటన జరిగిందని అన్నారు. తెలంగాణ మద్యం పాలసీ బాగోలేదని చెప్పారు. ఈ కారణాల వల్లే ఇటువంటి ఘటన చోటు చేసుకుందని అన్నారు. ఈ ఘటనపై తెలంగాణ మంత్రులు చేసిన వ్యాఖ్యలు సరికావని విమర్శించారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు  చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు.
Go Back to Shorts
Disha
Crime News
Lok Sabha
Uttam Kumar Reddy

More Telugu News