దేశం మొత్తాన్ని కలచివేసింది: 'దిశ' హత్యాచార ఘటనపై రాజ్యసభలో చర్చ
- సమస్యలను మూలాల నుంచి తొలగించాలి
- నిందితులను కఠినంగా శిక్షించాలి
- సామాజిక సంస్కరణ జరగాలి
- తమ అభిప్రాయాలను తెలిపిన ఎంపీలు
దిశ హత్య నిందితులను కఠినంగా శిక్షించాలని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. ఇటువంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఇటువంటి ఘటనలు జరగకుండా సామాజిక సంస్కరణ జరగాలని దేశంలోని న్యాయ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను తాను కోరుతున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అమీ యజ్ఞిక్ అన్నారు.