ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో డిప్యుటీ రిజిస్ట్రారు సస్పెండ్
ఆంధ్రా యూనివెర్సిటీ ఇంజనీరింగ్ బీటెక్ (మూడో సంవత్సరం) ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఐదుగురు అనుమానితులను ఏలూరు పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నారు. మరో వైపు ఆంధ్రా యూనివర్సిటీ కాన్ఫిడెన్షియల్ రూం నుంచి ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని గుర్తించిన యూనివర్సిటీ యాజమాన్యం డిప్యుటీ రిజిస్ట్రారు రాయుడును సస్పెండ్ చేసింది.