ఏమో సార్.. అప్పుడు ఫుల్లుగా తాగి ఉన్నాం.. ఏం చేస్తున్నామో సోయి లేదు: దిశ హత్యాచార నిందితులు
- యువతి ఒంటరిగా కనిపించడంతో ఏదో ఒకటి చేయాలని నిర్ణయం
- సోయి లేని స్థితిలోనే ఘాతుకం
- చంపేసి కాల్చేస్తే విషయం మరుగున పడిపోతుందని భావన
ఆమె ఎంత ఆలస్యంగా వస్తే తమ పని అంత సులభమవుతుందని భావించామని నిందితులు తెలిపారు. అత్యాచారం అనంతరం పారిపోవాలని అంతకుముందే నిర్ణయించుకున్నట్టు చెప్పారు. అయితే, ఆమెను చంపేసి కాల్చేస్తే ఎవరికీ తెలియదని అనుకున్నామని, కానీ ఇంత దూరం వస్తుందని అనుకోలేదని నిందితులు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు.