ప్రియాంక రెడ్డి నిందితుల రిమాండ్ రిపోర్టులో దిగ్భ్రాంతికర విషయాలు?
- మీడియా చానళ్ల వద్ద ప్రియాంక రెడ్డి రిమాండ్ రిపోర్ట్?
- రిపోర్ట్ లో ఒళ్లు గగుర్పొడిచే అంశాలు
- నరకం చవిచూసి కన్నుమూసిన ప్రియాంక
ఇక, అత్యాచారం సందర్భంగా ప్రియాంక రెడ్డి హెల్ప్ హెల్ప్ అంటున్నా కనికరించకుండా, నోట్లో బలవంతంగా మద్యం పోసిన వైనం ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఆమెపై నిందితులు వంతుల వారీగా అత్యాచారం జరిపినట్టు తెలుస్తోంది. దాదాపు గంటసేపు ఆమెపై అత్యాచారం జరిపారు. ఆమె అరవకుండా నోరు, ముక్కు గట్టిగా మూయడంతో ఊపిరాడక ఆ అభాగ్యురాలు ప్రాణాలు కోల్పోయింది.
అంతేకాదు, మృగాలు సైతం సిగ్గుపడేలా లారీలోకి ఆమె మృతదేహాన్ని చేర్చిన తర్వాత కూడా తమ పశువాంఛ తీర్చుకున్నారు. షాద్ నగర్ బ్రిడ్జ్ వద్ద ప్రియాంక మృతదేహాన్ని కిందకి దింపి ఆమె బతికుంటుందేమోనన్న అనుమానంతో దహనం చేశారు. కాగా, లారీ క్యాబిన్ లో ప్రియాంక రక్తపు మరకలు, వెంట్రుకలను ఫోరెన్సిక్ టీమ్ సేకరించింది.