Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మీరు పెంచాల్సింది కండలు కాదు: కుర్ర హీరోలకు రిషికపూర్ సలహా

  • కుర్ర హీరోలు బుర్రలు పెంచాలి
  • నటులకు కావాల్సింది ఎమోషనల్ వ్యాయామం
  • సిక్స్ ప్యాక్ బాడీ లేకున్నా.. ఇప్పటికీ నేను సినిమాలు చేస్తున్నా
ఇప్పుడు సినీ పరిశ్రమలోకి వస్తున్న హీరోలంతా తమ బాడీపై ఎక్కువ ఫోకస్ పెడుతున్న సంగతి తెలిసిందే. కండలు పెంచి, సిక్స్ ప్యాక్ బాడీలతో, ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. అయితే, ఈ కుర్ర హీరోలందరికీ బాలీవుడ్ అలనాటి స్టార్ హీరో రిషికపూర్ ఒక సలహా ఇచ్చారు. ఇండస్ట్రీలోకి వస్తున్న హీరోలు పెంచాల్సింది కండలు కాదని, బుర్రలు పెంచాలని అన్నారు. కండలు తిరిగిన బాడీ ఉంటేనే అవకాశాలు వస్తాయని హీరోలు అనుకుంటున్నారని... వాస్తవానికి నటులకు కావాల్సింది ఎమోషనల్ వ్యాయామమని చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆలోచనా సామర్థ్యం ఎక్కువగా ఉంటే నటించే నైపుణ్యం మెరుగు పడుతుందని, మంచి కాన్సెప్ట్ ను ఎంచుకునే సామర్థ్యం కూడా వస్తుందని రిషికపూర్ చెప్పారు. ఈ సామర్థ్యం లేకపోతే వేరొకరు వచ్చి వారి స్థానాలను భర్తీ చేస్తారని తెలిపారు. తననే ఉదాహరణగా తీసుకోవాలని... తనకు సిక్స్ ప్యాక్ బాడీ లేకున్నా... ఇప్పటికీ సినిమాలు చేస్తున్నానని చెప్పారు. ప్రతి సినిమాలో తన క్యారెక్టర్ ను తానే క్రియేట్ చేస్తానని తెలిపారు.

 అమితాబ్ బచ్చన్ సినిమాల్లోకి అడుగు పెట్టే సమయంలో చాలా సన్నగా ఉండేవాడని, ఇప్పటికీ అలాగే ఉన్నాడని, ఈ వయసులో కూడా ఆయనను యాంగ్రీ యంగ్ మ్యాన్ అనే పిలుస్తారని చెప్పారు. రణవీర్ సింగ్, రాజ్ కుమార్ రావు, ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్, రణబీర్ కపూర్ లకు కండలు తిరిగిన బాడీ లేకపోయినా, వారికున్న టాలెంట్ తో సత్తా చాటుతున్నారని తెలిపారు.
Rishi Kapoor
Bollywood

More Telugu News