Vijay Sai Reddy: అసాధ్యమైన కామెడీ వదిలాడు: చంద్రబాబుపై విజయసాయి రెడ్డి విమర్శలు

  • వచ్చే ఒలింపిక్స్ అమరావతిలోనేనని చెప్పాడు
  • ‘హైపర్ లూప్’ రవాణా వ్యవస్థ సిద్ధమవుతోందని చిటికెలేశాడు
  • ఇంటింటికి పైపులైన్ల ద్వారా ఏసీ చల్లదనాన్ని సరఫరా చేస్తామన్నాడు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

'వచ్చే ఒలింపిక్స్ అమరావతిలోనేనని చెప్పాడు. ప్రపంచంలో ఎక్కడా మొదలే కాని ‘హైపర్ లూప్’ రవాణా వ్యవస్థ సిద్ధమవుతోందని చిటికెలేశాడు. ఇంటింటికి పైపులైన్ల ద్వారా ఏసీ చల్లదనాన్ని సరఫరా చేస్తామని అసాధ్యమైన కామెడీ వదిలాడు. ఈ గిమ్మిక్కులన్నీ రియల్ ఎస్టేట్ ధరలు పెంచడం కోసం కాక మరేమిటి?' అని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.

కాగా, ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలకు కేవలం ఆరు నెలల్లో సీఎం జగన్ పరిష్కారం చూపారని విజయసాయి రెడ్డి అన్నారు. అవినీతిలేని, పారదర్శక పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన పాలనలో అందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని చెప్పారు. బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నారని అన్నారు. ఉద్యోగాల కల్పన జరుగుతోందని ట్వీట్ చేశారు.
Vijay Sai Reddy
YSRCP
Telugudesam

More Telugu News