నిత్యానంద ఆశీర్వదిస్తే, క్షణాల్లో మూడు అంగుళాల ఎత్తు పెరిగానంటున్న యువకుడు... నిజమేనంటున్న భార్య!

  • అహ్మదాబాద్ లో 'మహా సదాశివోహం'
  • నిత్యానంద అనుష్ఠానంతో ఎత్తు పెరిగా
  • ఫేస్ బుక్ లో యువకుడి వీడియో
క్షణాల్లో ఎవరైనా మూడు అంగుళాల ఎత్తు పెరుగుతారా? "నేను పెరిగాను" అని ఎవరైనా అంటే, అంతా ఫాల్స్ న్యూస్ అనే అంటారు. ఇప్పుడూ అదే అంటున్నారు. కానీ, ఈ యువకుడు మాత్రం తాను మూడు అంగుళాల ఎత్తు పెరిగానని చెబుతూ, ఫేస్ బుక్ లో వీడియో పోస్ట్ చేశాడు. అది వైరల్ అయి దూసుకుపోతోంది.

అహ్మదాబాద్ లో నిత్యానంద స్వామి తనను ఆశీర్వదించారని, ఆయన చెప్పిన అనుష్ఠానం ద్వారా కొన్ని నిమిషాల్లోనే ఎత్తు పెరిగానని అమితాబ్ షా అనే యువకుడు అంటున్నాడు. ఆ సమయంలో అతని పక్కనే ఉన్న భార్య, అతని ఎత్తును కొలిచి, అది నిజమేనని చెబుతోంది. తన భర్త రెండు అంగుళాల ఎత్తు పెరగాలని భావించారని, కానీ నిత్యానంద నిర్వహించిన 'మహా సదాశివోహం'లో పాల్గొన్న తరువాత మూడు అంగుళాల ఎత్తు పెరిగాడని చెబుతోంది. ఇక ఈ వీడియోను చూసిన వారంతా ప్రచారం కోసం పెట్టిన తప్పుడు వీడియో ఇదని అంటున్నారు.
Go Back to Shorts
Height
Nityananda
Youth
Wife
Facebook

More Telugu News