ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆమెకు కొత్తేం కాదు: ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యలపై అసదుద్దీన్ ఒవైసీ
- గాంధీకి ప్రజ్ఞా ఠాకూర్ శత్రువు
- ఆయనను హత్యచేసిన వారికి మద్దతుదారు
- ఈ విషయం ఆమె వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది
- స్పీకర్ కు ప్రివిలైజ్ మోషన్ ఇచ్చాను
'ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఆమెకు కొత్తేం కాదు. గాంధీకి ప్రజ్ఞా ఠాకూర్ శత్రువని, ఆయనను హత్యచేసిన వారికి మద్దతుదారని ఆమె వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. నేను ఈ విషయంపై ఇప్పటికే స్పీకర్ కు ప్రివిలైజ్ మోషన్ ఇచ్చాను. ఏం జరుగుతుందో చూద్దాం' అని అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యానించారు.
కాగా, ఈ విషయంపై లోక్ సభలో రాజ్ నాథ్ సింగ్ స్పందిస్తూ... నాథూరామ్ గాడ్సేని ఎవరైనా దేశ భక్తుడిగా పేర్కొంటే, తమ పార్టీ ఈ తీరును తప్పక ఖండిస్తుందని చెప్పారు. మహాత్మాగాంధీ తమకు మార్గ దర్శకుడని స్పష్టం చేశారు. ప్రజ్ఞా ఠాకూర్ ఈ వ్యాఖ్య చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.