నాగశౌర్య సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్
- అన్యాయాన్ని ప్రశ్నించే హీరోగా నాగశౌర్య
- ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న శ్రీచరణ్ పాకాల సంగీతం
- తొలిసారి నాగశౌర్యతో జోడీకడుతున్న మెహ్రీన్
రేపు (శుక్రవారం) సాయంత్రం 4:05 నిమిషాలకి కాన్సెప్ట్ మోషన్ పోస్టర్ ను విడుదల చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అన్యాయాన్ని ప్రశ్నించే డైనమిక్ హీరోగా ఈ సినిమాలో నాగశౌర్య కనిపించనున్నాడని అంటున్నారు. శ్రీచరణ్ పాకాల అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెబుతున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా సక్సెస్ ను ఇస్తుందనే నమ్మకంతో నాగశౌర్య వున్నాడు.