శివసేన భవన్ పై దర్శనమిచ్చిన ఇందిరాగాంధీ ఫొటో!
- నేడు కొలువుదీరనున్న సంకీర్ణ కూటమి
- మరాఠా చరిత్రలో తొలిసారి శివసేనకు సీఎం పదవి
- ఆనందం వ్యక్తం చేస్తున్న పార్టీ కార్యకర్తలు
కాగా, బాల్ థాకరే జీవించి ఉన్న సమయంలో ఎన్నోమార్లు ఇందిరాగాంధీకి మద్దతుగా నిలిచారు. 1975లో దేశమంతా వ్యతిరేకించిన అత్యయిక స్థితిని థాకరే సమర్థించారు. 1965లో మరాఠీల అభ్యున్నతి లక్ష్యంగా శివసేన పార్టీ ప్రారంభం కాగా, ఆ పార్టీకి చెందిన నాయకుడు ముఖ్యమంత్రి కావడం మాత్రం ఇదే తొలిసారి కావడంతో, ఆ పార్టీ నేతలు, కార్యకర్తల ఆనందానికి అవధులు లేవు.