ఆఫ్ఘాన్ బ్యాట్స్ మెన్ ను వణికించిన విండీస్ బౌలర్ కార్న్ వాల్
- కెరీర్ అత్యుత్తమ బౌలింగ్ తో హడలగొట్టిన స్పిన్నర్
- భారత పిచ్ లపై బెస్ట్ బౌలింగ్ రికార్డు నమోదు
- తొలి రోజు ఆటలో విండీస్ దే పైచేయి
కార్న్ వాల్ 7/75 వికెట్లు తీసి తన కెరీర్ లో అత్యుత్తమ రికార్డును నమోదు చేసుకున్నాడు. అంతేకాక, భారత పిచ్ లపై ఒక ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు సాధించిన మూడో విండీస్ బౌలర్ గా రికార్డు సృష్టించాడు. గతంలో విండీస్ బౌలర్లలో అండీ రాబర్ట్స్, లాన్స్ గిబ్స్ కూడా ఈ ఘనతను సాధించారు. అనంతరం విండీస్ తన తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించి ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. ఆఫ్ఘాన్ కన్నా విండీస్ ఇంకా 119 పరుగులు వెనకబడి ఉంది.