Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నితిన్ నిర్మాతగా మరో సినిమా

  • వరుస సినిమాలతో నితిన్ 
  •  హిట్ కోసం గట్టి ప్రయత్నం 
  • 'అంధాదున్' రీమేక్ కి సన్నాహాలు  
కొంతకాలంగా నితిన్ సక్సెస్ అనే మాటే వినలేదు. వరుసగా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర నిరాశ పరిచాయి. దాంతో కొంత గ్యాప్ తీసుకుని కథలపైనే దృష్టిపెట్టి, ఒక మూడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'భీష్మ' .. 'రంగ్ దే' .. 'చదరంగం' ఆ జాబితాలో వున్నాయి. ఈ మూడు ప్రాజెక్టులకి సంబంధించిన పనులను చూస్తూనే, త్వరలో సొంత బ్యానర్లో ఒక సినిమాను నిర్మించే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా సమాచారం.

హిందీలో చిన్న సినిమాగా వచ్చి పెద్ద హిట్ కొట్టిన 'అంధాదున్' తెలుగు రీమేక్ హక్కులను నితిన్ తీసుకున్నాడు. దాంతో ఆయనే ఆ రీమేక్ లో చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ ఒక యంగ్ హీరోతో ఈ సినిమాను రీమేక్ చేసేందుకు నితిన్ సన్నాహాలు మొదలెట్టాడని అంటున్నారు. ఈ సినిమా ద్వారా ఒక యువ దర్శకుడిని పరిచయం చేయనున్నాడని కూడా అంటున్నారు. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి.
Nithin

More Telugu News