అమరావతిపై జరుగుతున్న రాజకీయం గురించి మిగతా జిల్లాల వారికి తెలియడంలేదు: రాజధాని ప్రాంత రైతులు
- తుళ్లూరులో రాజధాని రైతుల సమావేశం
- ఇటీవలి పరిణామాలపై చర్చ
- ఆ ప్రకటనలు ఆందోళన కలిగిస్తున్నాయని వెల్లడి
ఏపీ భవిష్యత్ పై విశ్వాసంతో తాము భూములు ఇచ్చామని, ఇప్పుడు రాజధానిని ఎటూ కాకుండా చేయడం వల్ల ఆందోళనలు ఎక్కువవుతున్నాయని తెలిపారు. భూముల రేట్లు సైతం 30 నుంచి 50 శాతం పడిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ల్యాండ్ పూలింగ్ విధానం అద్భుతమని లండన్ వంటి చోట్ల ఎకనామిక్స్ పీహెచ్ డీలు చేస్తున్న తమ పిల్లలు చెబుతున్నారని, పరిస్థితి చూస్తుంటే ఈ ప్రభుత్వం కక్షగట్టి దెబ్బతీయాలని చూస్తున్నట్టుగా ఉందని ఆరోపించారు.