Anasuya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

   *  అప్పుడప్పుడు కొన్ని సినిమాలలో కూడా నటిస్తున్న గ్లామరస్ టీవీ యాంకర్ అనసూయ తాజాగా మరో చిత్రాన్ని అంగీకరించింది. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ కీలక పాత్రధారిగా రూపొందే 'రంగ మార్తాండ' చిత్రంలో ముఖ్య పాత్ర పోషించడానికి అనసూయ ఓకే చెప్పినట్టు తాజా సమాచారం.
*  ఇటీవల 'రాగల 24 గంటల్లో' అనే చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శ్రీనివాసరెడ్డి తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. 'భార్యదేవో భవ' పేరిట రూపొందే ఈ చిత్రంలో మొత్తం పది మంది కథానాయికలు నటిస్తారట.
*  తమిళంలో హిట్టయిన '96' చిత్రాన్ని 'జాను' పేరిట తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం విదితమే. శర్వానంద్, సమంత జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన రిలీజ్ చేయడానికి నిర్మాత దిల్ రాజు నిర్ణయించినట్టు తెలుస్తోంది.
Anasuya
Krishna Vamshi
Prakash Raj
Samanta

More Telugu News