హాయ్ అజార్... ఇది మనిద్దరి కన్నా పెద్ద విషయం... పర్సనల్ గా తీసుకోవద్దు: అంబటి రాయుడు
- హెచ్ సీఏలో అవినీతి అంటూ రాయుడు కలకలం
- స్పందించిన అజహరుద్దీన్
- రాయుడు ఓ అసహన క్రికెటర్ అంటూ వ్యాఖ్య
- తన ట్వీట్ పై వివరణ ఇచ్చిన రాయుడు
"హాయ్ అజార్, ఇది మనిద్దరి కంటే పెద్ద విషయం. దయచేసి వ్యక్తిగతంగా తీసుకోవద్దు. హెచ్ సీఏలో ఏం జరుగుతోందో మనిద్దరికీ తెలుసు. హెచ్ సీఏని ప్రక్షాళన చేసేందుకు మీ ముందు అద్భుత అవకాశం నిలిచి ఉంది. కొందరు ధూర్తుల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోండి. తద్వారా భావితరాల క్రికెటర్లకు మేలు చేసిన వారవుతారు" అంటూ రాయుడు ట్వీట్ చేశాడు.