ఓ బాలుడి కోసం 2100 స్పోర్ట్స్ కార్లు, 70 బైకులు తరలివచ్చాయి... అసలు కారణం ఇదే!
- క్యాన్సర్ తో కన్నుమూసిన అమెరికా బాలుడు
- స్పోర్ట్స్ కార్లతో అంతిమయాత్ర చివరికోరికగా తెలిపిన బాలుడు
- ముందుకొచ్చిన అమెరికా సమాజం
ఈ విషయం తెలిసిన అమెరికా సమాజం కదిలిపోయింది. ముఖ్యంగా సిడ్నీస్ సోల్జర్స్ ఆల్వేస్ అనే సంస్థ ముందుకొచ్చి స్పోర్ట్స్ కార్స్ ఫర్ అలెక్ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఓ కుర్రాడి చివరికోరిక తీర్చేందుకు దేశవ్యాప్తంగా ఉన్న స్పోర్ట్స్ కార్లు వాషింగ్టన్ లోని మిస్సౌరీ చేరుకున్నాయి. మిస్సౌరీ నుంచి వాషింగ్టన్ లోని ఇమ్యూనల్ లూథరన్ చర్చ్ వరకు అలెక్ కడసారి యాత్రకు తోడుగా వచ్చేందుకు స్థానిక సిక్స్ ఫ్లాగ్స్ సెయింట్ లూయిస్ పార్కింట్ ఏరియా వద్ద కొలువుదీరాయి. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.