చారిత్రాత్మక పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చారిత్రాత్మక పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ క్లీన్ స్వీప్

  • బంగ్లా తొలి ఇన్నింగ్స్ 106
  •  టీమిండియా తొలి ఇన్నింగ్స్ 347/9 డిక్లేర్
  • బంగ్లా రెండో ఇన్నింగ్స్ 195 (41.1 ఓవర్లకి)
  • ఇన్నింగ్స్, 46 పరుగులతో బంగ్లాదేశ్ పై విజయం
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా జరుగుతోన్న చారిత్రాత్మక పింక్ బాల్, డే/నైట్ టెస్ట్ లో టీమిండియా ఇన్నింగ్స్, 46 పరుగులతో బంగ్లాదేశ్ పై ఘన విజయం సాధించింది. టీమిండియా బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ బ్యాట్స్ మెన్ రాణించలేకపోయారు. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ లో 106 పరుగులకే ఆలౌట్ అయిన విషయం తెలిసిందే.
   టీమిండియా 347/9 కి తొలి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. మూడో రోజు ఆటలోనూ బంగ్లా బ్యాట్స్ మెన్ ఒకరి తర్వాత ఒకరు పెవీలియన్ కు క్యూకట్టారు. షాద్మాన్ ఇస్లాం 0, ఇమ్రుల్ 5, మోమినుల్ 0, మిథున్ 6, రహీం 74, మహ్మదుల్లా 39 (రిటైర్డ్ హర్ట్), మిరాజ్ 15, తైజుల 11, అల్ అమిన్ 21, ఎడాబట్ 0 పరుగులకు వెనుదిరిగారు. అబు జాయెద్ 2 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో 41.1 ఓవర్లకి 195 పరుగులకే బంగ్లా ఆలౌట్ అయింది. దీంతో బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది.
Kolkata
ICC
Cricket
Bangladesh

More Telugu News