త్వరలో మరిన్ని దక్షిణాది చిత్రాల్లో నటిస్తా: తాప్సి
- నటనకు సంబంధించి ఓనమాలను నేర్చుకున్నదిక్కడే
- దక్షిణాది సినిమాలను వదులుకుంటే అది తెలివి తక్కువతనమే
- ఇక్కడి చిత్రపరిశ్రమతో నాకెంతో అనుబంధం ఉంది
‘దక్షిణాది చిత్రపరిశ్రమతో నాకెంతో అనుబంధం ఉంది. నటనకు సంబంధించి ఓనమాలను ఇక్కడే నేర్చుకున్నాను. బాలీవుడ్ లోకి ప్రవేశించడానికి దక్షిణాది పరిశ్రమను పునాదిగా వాడుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. రానున్న రోజుల్లో మరిన్ని దక్షిణాది సినిమాల్లో కూడా నటించాలని కోరుకుంటున్నా. దక్షిణాది సినిమాలను వదులుకుంటే అది తెలివి తక్కువతనమే అవుతుంది’ అని పేర్కొంది.