Jagan: సీఎం జగన్ పై గణపతి సచ్చిదానంద స్వామి ప్రశంసల వర్షం

  • అద్భుతంగా పరిపాలిస్తున్నారని వ్యాఖ్యలు
  • అర్చకుల విషయంలో జగన్ నిర్ణయం చారిత్రాత్మకం అన్న స్వామి
  • తండ్రి వైఎస్సార్ అడుగుజాడల్లోనే నడుస్తున్నారని వెల్లడి
అవధూత దత్తపీఠం వ్యవస్థాపకులు గణపతి సచ్చిదానంద స్వామి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ అద్భుతంగా పరిపాలన సాగిస్తున్నారని కొనియాడారు. తండ్రి వైఎస్సార్ అడుగుజాడల్లోనే జగన్ కూడా నడుస్తున్నారని, ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకుల అనువంశిక వారసత్వ హక్కులను పునరుద్ధరిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం అని అభినందించారు. జగన్ పాలనలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం తనకుందని అన్నారు.

అంతేకాకుండా ఇంగ్లీషు మీడియం అంశంపైనా గణపతి సచ్చిదానంద తన అభిప్రాయాలు వెల్లడించారు. ఇతర దేశాలకు వెళ్లడానికి అవసరమయ్యే వీసా ఇంటర్వ్యూలోనూ ఇంగ్లీషు అవసరమని, ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇంగ్లీషు మీడియం వ్యవహారాన్ని వివాదాస్పదం చేయడం మానుకోవాలని హితవు పలికారు. వారణాసిలో నిర్వహిస్తున్న అతిరుద్ర యాగం పదో రోజు సందర్భంగా మాట్లాడుతూ స్వామి గణపతి సచ్చిదానంద ఈ వ్యాఖ్యలు చేశారు.
Jagan
Ganapati Sachidananda
Andhra Pradesh
YSRCP

More Telugu News