Tirumala: శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే

  •  స్వామివారి ఉత్సవమూర్తి ఊరేగింపులో పాల్గొన్న సీజేఐ
  •  శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొన్న బోబ్డే
  • బోబ్డేతో పాటు స్వామిని దర్శించుకున్న ఏపీ హైకోర్టు సీజేఐ జేకే మహేశ్వరి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి ఈ రోజు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. బోబ్డే తొలుత స్వామివారి ఉత్సవమూర్తి ఊరేగింపులో పాల్గొని వరాహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

అంతకుముందు బోబ్డే, మహేశ్వరిలకు తిరుమలలో పద్మావతి అతిథి గృహం వద్ద టీటీడీ ధర్మకర్తల మండలి ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. బోబ్డే రేపు కూడా మరోసారి స్వామివారిని దర్శించుకుంటారని సమాచారం.


Tirumala
Supreme Court
CJI SA Bobde
AP HIGH COURT
CJI Mahaswari visit

More Telugu News