Narendra Modi: థ్యాంక్స్ మోదీ గారూ... కేంద్రానికి చంద్రబాబు లేఖ

  • ఇటీవల అమరావతి లేకుండానే పొలిటికల్ మ్యాప్ విడుదల
  • పార్లమెంటులో లేవనెత్తిన టీడీపీ ఎంపీలు
  • తప్పు సరిదిద్దుకున్న కేంద్రం
  • కేంద్రానికి ధన్యవాదాలు చెబుతూ చంద్రబాబు లేఖ
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి కిషన్ రెడ్డిలకు లేఖ రాశారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన జాతీయ మ్యాప్ లో ఏపీ రాజధాని అమరావతి లేదు. ఆ తర్వాత గల్లా జయదేవ్ పార్లమెంటులో గట్టిగా ప్రస్తావించడంతో ఈసారి అమరావతితో కూడిన మ్యాప్ విడుదల చేశారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ లేఖ రాశారు. భారతదేశ పొలిటికల్ మ్యాప్ లో అమరావతిని చేర్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు.

ప్రధాని మోదీ చేతులమీదుగానే అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని, కానీ ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతికి కేంద్రం విడుదల చేసిన మ్యాప్ లో స్థానం లేకపోవడం బాధ కలిగించిందని తన లేఖలో పేర్కొన్నారు. అయితే ఈ అంశాన్ని టీడీపీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తడంతో కేంద్రం వెంటనే స్పందించి అమరావతి సహిత మ్యాప్ ను రిలీజ్ చేసిందని తెలిపారు. ఈ మేరకు అమిత్ షా, కిషన్ రెడ్డిలకు కూడా చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
Narendra Modi
Chandrababu
Telugudesam
Andhra Pradesh
Amaravathi
Amit Shah
Kishan Reddy

More Telugu News