ASI Suicide attempt at Balapur Ps: హైదరాబాద్ లో ఏఎస్ఐ నరసింహ ఆత్మహత్యాయత్నం

  • బాలాపూర్ పీఎస్ ఎదుట పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఏఎస్ఐ
  • అన్యాయంగా బదిలీ చేశారన్నా ఆవేదనతో..
  • తీవ్రగాయాలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నరసింహ
హైదరాబాద్, బాలాపూర్ పోలీస్ స్టేషన్ ఎదుట ఏఎస్ఐ నరసింహ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.  ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో డీఆర్ డీవో అపోలో ఆస్పత్రికి పోలీసులు తరలించారు. నరసింహ ప్రస్తుతం మంచాల పీఎస్ లో డ్యూటీ చేస్తున్నారు. గతంలో బాలాపూర్ లో పీఎస్ లో పనిచేసిన నరసింహ సీఐ సైదులుపై ఫిర్యాదు చేస్తే అధికారులు వేధించారని ఆరోపించారు. అన్యాయంగా మంచాలకు బదిలీ చేశారని, అప్పటినుంచి నరసింహ అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది.
ASI Suicide attempt at Balapur Ps
Telangana
Hyderabad

More Telugu News