Lakshmi Parvathi: సినీరంగ ప్రవేశం చేస్తున్న లక్ష్మీపార్వతి?

  • 'రాధాకృష్ణ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శ్రీనివాసరెడ్డి
  • తెలంగాణ నేపథ్యంలో సినిమా
  • కీలక పాత్రను పోషించిన లక్ష్మీపార్వతి
వైసీపీ నాయకురాలు, ఏపీ తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి సినీరంగ ప్రవేశం చేస్తున్నట్టు తెలుస్తోంది. 'రాధాకృష్ణ' అనే చిత్రంలో ఆమె నటిస్తున్నారు. దీనికి సినీనటుడు శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలే దర్శకుడిగా మారిన శ్రీనివాసరెడ్డి తాజాగా 'రాగల 24 గంటల్లో' అనే చిత్రాన్ని రూపొందించారు. ఆయన తదుపరి చిత్రం ఈ 'రాధాకృష్ణ'. మహిళా ప్రధాన కథతో తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాలో లక్ష్మీపార్వతి కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. 
Lakshmi Parvathi
YSRCP
Movie
Tollywood

More Telugu News