స్పెక్ట్రం చెల్లింపులపై రెండేళ్ల మారటోరియం.. ఊపిరి పీల్చుకున్న ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా
- తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఎయిర్టెల్, వొడాఫోన్
- వేలకోట్ల రూపాయల స్పెక్ట్రం బకాయిలు
- 2022-23 వరకు బేఫికర్
ఈ నేపథ్యంలో ఉద్దీపన ప్రకటించాలని ఇటీవల కేంద్రానికి మొరపెట్టుకున్నాయి. స్పెక్ట్రం చెల్లింపులపై మారటోరియంతోపాటు వాయిదాలను పెంచాలని కోరాయి. దీంతో స్పందించిన ప్రభుత్వం స్పెక్ట్రం చెల్లింపులపై రెండేళ్లపాటు మారటోరియం విధించింది. దీంతో ప్రస్తుతం ఎటువంటి స్పెక్ట్రం ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. 2020-23 ఆర్థిక సంవత్సరంలో స్పెక్ట్రం బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది. కాగా, జూలై-సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి వొడాఫోన్ ఐడియా రూ.51,000 కోట్ల నష్టాల్లో ఉండగా, ఎయిర్టెల్ రూ.23,000 కోట్ల నష్టాల్లో ఉంది.