cm: ఏ పాలసీ అయినా దోచుకోవడమే వైసీపీ నేతల లక్ష్యం: చంద్రబాబునాయుడు

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పాలసీలపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శలు చేశారు.  ఇసుక పాలసీ అయినా, మద్యం పాలసీ అయినా.. ఏ పాలసీ అయినా సరే, దోచుకోవడమే వైసీపీ నేతల లక్ష్యమని, ఈ విషయాన్ని సామాన్యుడే ప్రశ్నిస్తున్నాడని, జవాబు చెప్పే ధైర్యం వారికి ఉందా? అని ఓ పోస్ట్ లో ప్రశ్నించారు.

 ఈ సందర్భంగా ఓ సామాన్యుడు మాట్లాడుతున్న వీడియోను జతపరిచారు. ఇవాళ పరిస్థితి చూస్తుంటే చాలా అస్తవ్యస్తంగా వుంది. అడ్మినిస్ట్రేషన్ తెలియని ఆయన ముఖ్యమంత్రి అయితే ఏ రకంగా వుంటుందో.. ఆ బాధలన్నీ ప్రజలు బహిరంగంగా అనుభవిస్తున్నారు..’ అంటూ సామాన్య వ్యక్తి విమర్శించారు. పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్న ఇసుక అక్రమ రవాణాను నిరోధించలేరా? పొరుగు రాష్ట్రాల నుంచి ఏపీలోకి అక్రమంగా తరలిస్తున్న నాన్ డ్యూటీ లిక్కర్ ను అడ్డుకోలేరా? అని ప్రభుత్వాన్ని చంద్రబాబు ప్రశ్నించారు.
cm
Jagan
Telugudesam
Chandrababu
YSRCP

More Telugu News