అయోధ్య తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం

  • ఇటీవలే సుప్రీంలో అయోధ్య వివాదంపై అంతిమతీర్పు
  • మరింత స్పష్టత కోరాలని ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం
  • లక్నోలో ముగిసిన సమావేశం
లక్నోలో ముస్లి పర్సనల్ లా బోర్డు సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. అయోధ్య భూవివాదం తీర్పుపై సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అయోధ్యలో వివాదాస్పద 2.77 ఎకరాల భూమి హిందువులదేనని సుప్రీం కోర్టు కొన్నిరోజుల క్రితం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. ఈ విషయం చర్చించేందుకు సమావేశమైన ముస్లిం పర్సనల్ లా బోర్డు రివ్యూ పిటిషన్ దాఖలు చేయడం తమ హక్కు అని తీర్మానించింది.

దీనిపై జమాయిత్ ఉలేమా ఈ హింద్ అధ్యక్షుడు అర్షద్ మదాని మాట్లాడుతూ, అయోధ్యలో ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించలేదని సుప్రీం కోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందని, అయినప్పటికీ తమకు అక్కడ మసీదును ఇంతవరకు కేటాయించలేదని అన్నారు. అందుకే, వాస్తవంగా అక్కడ తమకు రావాల్సింది ఏమిటి అనేదానిపై స్పష్టత కోరుతూ సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలనుకుంటున్నామని వెల్లడించారు. అటు, యూపీ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు సుప్రీం నిర్ణయాన్ని స్వాగతించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Ayodhya
Supreme Court
Muslim Personal Law Board

More Telugu News