జీవితాంతం వైసీపీలోనే కొనసాగుతా: ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి
- యాగంటి నుంచి శ్రీశైలానికి పాదయాత్ర చేస్తున్న కాటసాని
- రైతుల సమస్య తెలుసుకోవడానికి ఈ యాత్ర చేస్తున్నానని వెల్లడి
- సమస్యలన్నింటినీ జగన్ ప్రభుత్వం పరిష్కరిస్తుంది
తన జీవితాంతం వైసీపీలోనే కొనసాగుతానని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. చివరివరకు జగన్ తోనే నడుస్తానన్నారు. ఇసుక సమస్యను త్వరలోనే తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు. రైతుల సమస్యలు తెలుసుకునేందుకు యాగంటి నుంచి శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టిన కాటసాని యాత్ర నిన్న పాణ్యంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
శ్రీశైలం, గోరుకల్లు నిండితే పాదయాత్ర చేపడతానని గతంలో తాను ప్రకటన చేశానంటూ.. ఈ మేరకే పాదయాత్ర చేపట్టానన్నారు. గోరుకల్లు రిజర్వాయర్ కు తాను కోరిన వెంటనే దివంగత వైఎస్సార్ రూ.470కోట్లు కేటాయించి రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించారన్నారు. శ్రీశైలం రిజర్వాయర్ చరిత్రలో 8సార్లు గేట్లు ఎత్తిన ఘనత జగన్ పాలనకే దక్కిందన్నారు. గాలేరు, నగరి హెడ్ రెగ్యులేటర్ కు గేట్లు ఏర్పాటు చేసి రెండు పంటలకు నీరు అందిస్తామన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సమస్య పరిష్కారానికి తమ ప్రభుత్వం 170కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. ఎస్సార్బీసీ పంట కాల్వల నుంచి పంటలకు నీరు అందటం లేదని రైతులు ఆందోళన చెందనవసరంలేదని, త్వరలో మీ సమస్య తీరుతుందని హామీ ఇచ్చారు.