టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం పార్టీ పెద్దలకు బయోడేటా పంపా: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
- కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడానికి అద్భుతమైన మందు ఉంది
- అవసరమైనప్పుడు బయటకు తీస్తా
- పార్టీలో తప్పుచేస్తే నిలదీసే హక్కు కార్యకర్తలకు ఉంటుంది
ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వైదొలిగిన తర్వాత ఆ పదవి తనకు ఇవ్వాలని ఏఐసీసీకి విన్నవించానన్నారు. ఈ నెల 16న ఢిల్లీలో ఏఐసీసీ సమావేశం జరగనుందన్నారు. తన బయోడేటాను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులకు పంపానని తెలిపారు.