avinash: టీడీపీకి రాజీనామా లేఖ పంపిన దేవినేని అవినాశ్

  • కడియాల బుచ్చిబాబు కూడా  రాజీనామా
  • వైసీపీలో చేరనున్న అవినాశ్
  • టీడీపీలో గుర్తింపు లభించడంలేదని అవినాశ్ అసంతృప్తి
టీడీపీ నేత దేవినేని అవినాశ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. ఆయనతో పాటు కడియాల బుచ్చిబాబు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. టీడీపీలో తనకు తగిన గుర్తింపు లభించడంలేదని అవినాశ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలో చేరే విషయంపై ఇప్పటికే ఆయన తన అనుచరులతో చర్చించిన విషయం తెలిసిందే.

తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించిన దేవినేని అవినాశ్‌.. ఏపీ యువతలో మంచి పట్టున్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. గత ఎన్నికల్లో గుడివాడ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆయన పార్టీ మారుతున్నారంటూ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగగా, పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేసిన విషయం తెలిసిందే. చివరకు ఆయన ఈ రోజు వైసీపీలో చేరనున్నారు.
avinash
Telugudesam
YSRCP

More Telugu News