దీపక్ చాహర్ గురించి తొమ్మిదేళ్ల క్రితం ఆకాశ్ చోప్రా ట్వీట్.. అప్పుడు చెప్పినట్లే ఇప్పుడు జరిగింది!

  • చాలా ప్రతిభ ఉన్న యువ ఆటగాడిని చూశానని ఆకాశ్ ట్వీట్
  • దీపక్ చాహర్ పేరును గుర్తు పెట్టుకోండి
  • భవిష్యత్ లో అతడి ఆటతీరును గురించి మీరంతా చర్చించుకుంటారు
ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన చివరి టీ20లో టీమిండియా బౌలర్ దీపక్ చాహర్ హ్యాట్రిక్ తో అద్భుత ప్రతిభ కనబర్చిన విషయం తెలిసిందే. ఆరు వికెట్లు తీసి టీమిండియాకు విజయాన్ని అందించాడు. దీంతో అతడి పేరు మార్మోగిపోతోంది. అతడిని ఉద్దేశించి భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా 2010లోనే ఓ విషయం చెప్పాడు.

అప్పట్లో ఆయన దీపక్ చాహర్ గురించి చేసిన ట్వీట్ ఇప్పుడు  వైరల్ అవుతోంది. 'చాలా ప్రతిభ ఉన్న యువ ఆటగాడిని చూశాను. అతడు రాజస్థాన్ కు చెందిన దీపక్.. దీపక్ చాహర్ పేరును గుర్తు పెట్టుకోండి. భవిష్యత్ లో అతడి ఆటతీరును గురించి మీరంతా చర్చించుకుంటారు' అని చెప్పాడు. ఆయన చెప్పినట్లే ఇప్పుడు దీపక్ చాహర్ గురించి క్రికెట్ అభిమానులంతా చర్చించుకుంటున్నారు. తొమ్మిదేళ్ల క్రితమే ఆకాశ్ వేసిన అంచనాను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Go Back to Shorts
Cricket
India
Bangladesh

More Telugu News