56 ఏళ్ల మా అమ్మకు భర్త కావాలంటూ.. మోహిని అనే మహిళ ప్రకటన!
- ట్విట్టర్లో సంచలనం రేపిన యాడ్
- వరుడు శుద్ధ శాకాహారి అయివుండాలి
- మా అమ్మకు భర్తగా, పిల్లలకు తండ్రిగా ఉండాలి
‘నా 56 ఏళ్ల తల్లికి 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న వరుడు కావలెను. ఆయన శుద్ధ శాకాహారి అయివుండాలి. అదేవిధంగా ఆయనకు పొగ, మధ్యపానం సేవించే అలవాట్లు ఉండకూడదు. నా తల్లిని జీవిత భాగస్వామిగా చేసుకుని ప్రేమించే మనస్తత్వం కలిగివుండాలి. పిల్లల బాధ్యత తీసుకోవాలి’ అని మోహిని పోస్ట్ చేశారు. ఆసక్తి ఉన్నవారు చూడటంకోసం తన తల్లితో దిగిన ఫొటోను కూడా ఆమె ట్విట్టర్లో పెట్టారు.