'రొమాంటిక్' షూటింగులో జాయినైన రమ్యకృష్ణ
- గోవాలో 'రొమాంటిక్' తాజా షెడ్యూల్
- నెల రోజుల పాటు జరగనున్న చిత్రీకరణ
- కథానాయికగా కేతిక శర్మ పరిచయం
తన సినిమాలకి సంబంధించిన ఒకటి రెండు సీన్స్ అయినా గోవాలో తీయడమనేది పూరి సెంటిమెంట్. అలా 'రొమాంటిక్' షూటింగ్ కూడా ఆయన అక్కడ పెట్టాడు. ఈ షెడ్యూల్లో రమ్యకృష్ణ కాంబినేషన్ సీన్స్ ఉండటం వలన, తాజాగా షూటింగులో ఆమె జాయినయ్యారు. నెల రోజుల పాటు జరిగే ఈ షూటింగులో కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు ఒకటి రెండు పాటలను కూడా చిత్రీకరించనున్నారు. ఈ ప్రేమకథా చిత్రంతో హీరోగా ఆకాశ్ నిలదొక్కుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.