సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మొదలైన జయలలిత బయోపిక్
- హిందీ మార్కెట్ పై కన్నేసిన ప్రభాస్
- రవితేజ సినిమాలో వరలక్ష్మి
* 'బాహుబలి', 'సాహో' చిత్రాలతో హీరో ప్రభాస్ హిందీలో కూడా మంచి మార్కెట్టును సొంతం చేసుకున్నాడు. దీంతో ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తను నటిస్తున్న చిత్రాన్ని కూడా హిందీలో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారట.
* రవితేజ హీరోగా నటించే సినిమాలో తమిళ నటి వరలక్ష్మి కీలక పాత్ర పోషించనుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ ఓ చిత్రాన్ని చేయనున్న సంగతి విదితమే. శ్రుతి హాసన్ కథానాయికగా నటించే ఈ చిత్రంలో వరలక్ష్మి నెగటివ్ టచ్ తో కూడిన పాత్రను చేస్తుందట.