డిసెంబర్ మొదటివారంలో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
- మరో రెండు రోజుల్లో తేదీలు ఖరారు
- సభలోకి పలు ముఖ్యమైన బిల్లులు
- సిద్ధమవుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు
రెండు సమావేశాల మధ్య విరామం ఆరునెలలు మించకూడదన్న నేపథ్యంలో తాజాగా వచ్చే నెల తొలివారంలో శీతాకాల సమావేశాలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో పలు మఖ్యమైన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఇందులో ముఖ్యమైన ఇసుక విధానానికి సంబంధించి బిల్లు కూడా ఉంది. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు తగిన సమాచారంతో సిద్ధమవుతున్నారు.