పెద్ద నోట్ల రద్దుకు నేటితో మూడేళ్లు... కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
- మూడేళ్ల కిందట నోట్ల రద్దు
- దేశంలో తీవ్ర కలకలం
- మరోసారి ధ్వజమెత్తిన రాహుల్
నోట్ల రద్దు ఉగ్ర దాడికి మూడేళ్లు నిండాయని, ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిందని ఆరోపించారు. ఎంతోమంది ప్రాణాలను హరించిన ఈ నిర్ణయం మరెందరినో నిరుద్యోగులుగా మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో చిరు వ్యాపారాలు నోట్ల రద్దు కారణంగా ముగిసిపోయాయని అన్నారు. ఈ నోట్ల రద్దు ఉగ్ర దాడికి కారణమైన వారిని చట్టం ముందు దోషులుగా నిలపాల్సిన అవసరం ఉందన్నారు.