ఆరేళ్ల చిన్నారి గొంతుకోసి హత్య.. పెళ్లి వేడుకలో విషాదం

  • చిత్తూరు జిల్లా చేనేతనగర్‌లో ఘటన
  • కుమార్తెతోపాటు వివాహానికి హాజరైన తల్లిదండ్రులు
  • రాత్రి అదృశ్యమైన బిడ్డ తెల్లారేసరికి విగతజీవిగా మారిన వైనం 
కర్కశ హృదయుల పాశవిక చర్యతో ఓ ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. పెళ్లి వేడుకకు కుమార్తెతో పాటు వచ్చిన తల్లిదండ్రులకు తెల్లారేసరికి తమ కుమార్తె విగతజీవిగా కనిపించడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.

వివరాల్లోకి వెళితే... చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం గుట్టపాలెంకు చెందిన ఓ జంట నిన్న తమ బంధువుల పెళ్లి జరుగుతుండడంతో కొరబకోట మండలం చేనేతనగర్‌లో ఉన్న కల్యాణ మండపానికి కుమార్తె వర్షిత (6)తో కలిసి హాజరయ్యారు. రాత్రయ్యేసరికి చిన్నారి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ఎంతగా వెతికినా చిన్నారి ఆచూకీ లభించలేదు.

కూతురి కోసం వెతుకుతున్న తల్లిదండ్రులకు ఈరోజు ఉదయం చిన్నారి మృతదేహం లభించడంతో గొల్లుమంటూ కుప్పకూలిపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి చిన్నారిని కిడ్నాప్‌చేసి అనంతరం గొంతుకోసి హత్య చేశారు. మృతదేహాన్ని దూరంగా పడేసి వెళ్లిపోయారు. ఈ హత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Crime News
Chittoor District
chaild murdered

More Telugu News