లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు చిక్కిన గూడూరు తహసీల్దార్
- భూ సెటిల్మెంట్ విషయంలో రైతుతో బేరసారాలు
- ఎనిమిది లక్షలు ఇవ్వాలని కండిషన్
- రైతు నాలుగు లక్షలు ఇస్తుండగా పట్టుకున్న అధికారులు
ఇందుకోసం దరఖాస్తు చేసుకున్న రైతు పలుమార్లు అధికారులను కలిశాడు. ఈ లావాదేవీ పూర్తి చేసేందుకు గూడురు తహసీల్దార్ హసినాబీ 8 లక్షల రూపాయలు డిమాండ్ చేశారన్నది రైతు ఆరోపణ. దీనికి రైతు అంగీకరించడంతో ముందుగా నాలుగు లక్షలు ఇవ్వాలని కండిషన్ విధించారు. ఈ మేరకు రైతు నుంచి తహసీల్దార్ నాలుగు లక్షల రూపాయలు తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.