వెళ్లాలా, వద్దా?... ఏదో ఒక విషయం చెప్పండి: కేంద్రానికి మరో లేఖ రాసిన సిద్ధూ
- ఈ నెల 9న పాక్ లో కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభోత్సవం
- వెళ్లేందుకు అనుమతించాలంటూ సిద్ధూ విజ్ఞప్తి
- స్పందించని కేంద్రం
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ ను పాకిస్థాన్ ప్రభుత్వం ఈ నెల 9న ప్రారంభిస్తోంది. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ కార్యక్రమానికి తన స్నేహితుడైన సిద్ధూను కూడా ఆహ్వానించారు. కొన్నాళ్ల కిందట ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారం చేస్తుంటే సిద్ధూ కూడా హాజరై శుభాకాంక్షలు తెలిపాడు.