Pawan Kalyan: పార్టీ అధికార ప్రతినిధులను కూడా ప్రకటించేసిన పవన్ కల్యాణ్!

జనసేనాని పవన్ కల్యాణ్ విశాఖ లాంగ్ మార్చ్ విజయవంతం కావడంతో ఉత్సాహంతో ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే పొలిటికల్ అఫైర్స్ కమిటీని మరో నలుగురు సభ్యులతో విస్తరించిన ఆయన తాజాగా పార్టీ అధికార ప్రతినిధులుగా మరో ముగ్గురి పేర్లను ప్రకటించారు. పండా సుజాత, సుందరపు విజయ్ కుమార్, పరుచూరి భాస్కర్ రావులను జనసేన పార్టీ అధికార ప్రతినిధులుగా నియమిస్తున్నట్టు పవన్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

ప్రజల పక్షాన నిలిచేందుకు వారు చేస్తున్న కృషి అమోఘం అని కొనియాడారు. అంతేకాదు, విశాఖ లాంగ్ మార్చ్ నిర్వహణలో విశేషంగా తోడ్పాటు అందించారంటూ పార్టీ నేతలు తోట చంద్రశేఖర్, వీవీ లక్ష్మీనారాయణ, కొణిదెల నాగబాబులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Pawan Kalyan
Jana Sena
Andhra Pradesh

More Telugu News