అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం: మౌలానా అర్షాద్ మద్ని
- 400 ఏళ్ల నుంచి బాబ్రీ మసీదు ఉంది
- మసీదు ఎప్పటికీ మసీదే
- ప్రజలు భయానక వాతావరణంలో ఉన్నారు
ఈ నెల 17న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయబోతున్నారు. ఈలోగానే ఆయన నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య కేసులో తీర్పును వెలువరించబోతోంది. కోర్టు తీర్పు నేపథ్యంలో, ఉత్తరప్రదేశ్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కేంద్ర ప్రభుత్వం 4 వేల మందితో కూడిన అదనపు పారామిలిటరీ బలగాలను అక్కడకు తరలిస్తోంది.