టాలీవుడ్ సెలబ్రిటీల ఫిట్ నెస్ ట్రయినర్ అరెస్ట్!
- యూత్ ఫిట్ నెస్ క్లబ్ పేరిట మోసం
- వార్షిక సభ్యత్వాలు ఇచ్చి సెంటర్ల మూసివేత
- అరెస్ట్ చేసిన పోలీసులు
తమ నుంచి వార్షిక సభ్యత్వ రుసుము పేరిట ఒక్కొక్కరి నుంచి రూ. 20 వేల వరకూ వసూలు చేశారని చెప్పిన సుమారు 50 మంది బాధితులు, మొత్తం ఆరు లక్షలకు పైగా నష్టపోయామని ఫిర్యాదు చేశారు. దీంతో కేసును రిజిస్టర్ చేసిన పోలీసులు, సయ్యద్ ను అరెస్ట్ చేసి, కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అనుమతితో ఈ నెల 6 వరకూ సయ్యద్ ను ప్రశ్నించనున్నామని అధికారులు వెల్లడించారు. కాగా, తాము ఎవరినీ మోసం చేయలేదని, సెంటర్ ను మూసివేసే ముందు అందరి సెల్ ఫోన్లకూ మెసేజ్ లు పెట్టామని యూత్ ఫిట్ నెస్ క్లబ్ చెబుతుండటం గమనార్హం.