కరీంనగర్లో దారుణం: పొలంలో గడ్డికోస్తున్న వివాహితపై అత్యాచారం.. హత్య
- స్నేహితుడి భార్యపైనే అఘాయిత్యం
- ఆపై ఫోన్ చేసి గ్రామస్థులకు చెప్పిన వైనం
- పోలీసుల అదుపులో నిందితుడు
అలా వెళ్లిన శ్రీనివాస్.. పొలంలో ఒంటరిగా ఉన్న స్నేహితుడి భార్య (45)పై అత్యాచారానికి పాల్పడి, ఆపై హత్య చేసి ఆమె మెడలోని మూడు తులాల బంగారు మంగళసూత్రాన్ని తీసుకుని పరారయ్యాడు. వెళ్తూవెళ్తూ ఓ మహిళ పొలంలో మృతి చెంది పడి ఉందని గ్రామస్థులకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో పొలానికి చేరుకుని గాలించిన గ్రామస్థులకు మహిళ మృతదేహం కనిపించింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు బెజ్జంకి మండలంలోని బేగంపేట శివారులో నిందితుడు శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.