సెంటిమెంట్ ప్రకారమే రజనీ న్యూ మూవీ టైటిల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సెంటిమెంట్ ప్రకారమే రజనీ న్యూ మూవీ టైటిల్

  • రజనీ తాజా చిత్రంగా రానున్న 'దర్బార్'
  • శివ దర్శకత్వంలో తదుపరి సినిమా 
  • పరిశీలనలో 'వియోగం' టైటిల్
రజనీకాంత్ తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'దర్బార్' చిత్రం సిద్ధమవుతోంది. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. రజనీ తదుపరి చిత్రానికి 'శివ' దర్శకత్వం వహించనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ఈ సినిమాకి 'వియోగం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. గతంలో 'V' అక్షరంతో మొదలయ్యే టైటిల్స్ తో శివ చేసిన సినిమాలన్నీ భారీ విజయాలను అందుకున్నాయి. 'వీరమ్' .. 'వివేకం' .. 'విశ్వాసం' వంటి హిట్లు అయన నుంచి వచ్చినవే. అందువల్లనే అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తూ ఆయన రజనీ సినిమాకి 'వియోగం' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టుగా చెబుతున్నారు. సన్ పిక్చర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే వున్నాయి.
Rajani
Shiva

More Telugu News