Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తమిళ హాస్యనటుడు సెంథిల్ కుమార్‌ను మోసం చేసిన మేనేజర్

  • సెంథిల్ కుమార్ ఫ్లాట్‌ను రూ. 2.60 లక్షల అద్దెకు తీసుకున్న ప్రొడక్షన్ మేనేజర్
  • ఆరు నెలలుగా చెల్లించని అద్దె
  • తన ఫ్లాట్‌గా చెప్పుకుని మరొకరికి అద్దెకిచ్చిన సగాయరాజ్
తమిళ చిత్రసీమకు చెందిన ప్రముఖ హాస్యనటుడు సెంథిల్ కుమార్‌ను మోసం చేసిన ప్రొడక్షన్ మేనేజర్‌ను చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. సాలిగ్రామంలోని భాస్కర్ కాలనీ 3వ వీధిలో ఉన్న ఓ అపార్ట్ మెంటులో పది ఫ్లాట్ లు వున్న రెండో అంతస్తు మొత్తం సెంథిల్ కుమార్‌ది. 2013లో సినిమా ప్రొడక్షన్ మేనేజర్ సగాయరాజ్ ఆ అంతస్తును నెలకు రూ.2.60 లక్షల అద్దెకు తీసుకున్నాడు. ఆరేళ్ల నుంచి క్రమం తప్పకుండా అద్దె చెల్లిస్తున్న సగాయరాజ్ గత ఆరు నెలలుగా చెల్లించడం లేదు. దీంతో తనకు రావాల్సిన అద్దె కోసం సెంథిల్ కుమార్ ఆయనకు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు.

అనుమానం వచ్చిన సెంథిల్ కుమార్ నేరుగా తన ఫ్లాట్‌కు వెళ్లగా అక్కడ వేరే వ్యక్తులు ఉన్నారు. వారిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సగాయరాజ్ ఈ అపార్ట్‌మెంట్‌‌ను తమకు లీజుకు ఇచ్చాడని, మరికొందరికి అద్దెకు ఇచ్చాడని చెప్పడంతో సెంథిల్ కుమార్ విస్తుపోయాడు. సగాయరాజ్ తనను మోసం చేశాడంటూ విరుగంబాక్కమ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్‌ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
senthil kumar
kollywood
production manager

More Telugu News